TSPSC : ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల..

by Rajesh |
TSPSC : ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల..
X

దిశ, వెబ్‌డెస్క్: పలు ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ విభాగాల్లో పరీక్షల ఫలితాలు రిలీజ్ చేసింది. వీటితో పాటు అకౌంట్ ఆఫీసర్లు, జూనియర్ అకౌంట్. సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ల పరీక్షల ఫలితాలను వెల్లడించింది. కాగా అకౌంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టులో పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. మొత్తం 12,186 మంది అభ్యర్థుల ర్యాంకులను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ధ్రువ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా త్వరలో విడుదల చేయనున్నారు. సింగరేణిలో 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులకు నేడు నోటిఫికేషన్లను విడుదల చేయనుంది.



Next Story

Most Viewed