ఆర్టీసీ కార్మికులపై పనిభారం తగ్గించాలి: టీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్

by Disha Web Desk 21 |
ఆర్టీసీ కార్మికులపై పనిభారం తగ్గించాలి: టీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీలో పెండింగ్‌లో ఉన్న సమస్యలన్ని పరిష్కరించాలని, కార్మికులపై పనిభారం తగ్గించాలని టీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం టీఎస్ ఆర్టీసీ జేఏసీ సమావేశం ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. స్పెషల్ ఆఫ్ డ్యూటీలను సింగిల్ క్రూడ్యూటీలుగా మార్చడాన్ని ఆపాలని, స్పెషల్ ఆఫ్ డ్యూటీలుగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహిళా కండక్టర్లకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు డ్యూటీలు ఇవ్వాలన్నారు. ఈపీకే, కేఎంపీఎల్‌ పైన వేధించే విధానం మానుకోవాలని చెప్పారు. లీవులు ఇవ్వడంలో అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అవసరం మేరకు లీవులు ఇవ్వాలని తెలిపారు. 2017, 2021 వేతన సవరణలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

జులై 2020 నుంచి రావాల్సిన 5 డీఏలు అమలు చేయాలని కోరారు. కారుణ్యనియామాకాలు, మెడికల్ అన్‌ఫిట్ అయిన వారి పిల్లలకు రేగ్యలర్ ప్రాతిపదికన నియామాకాలు చేయాలని అన్నారు. యాజమాన్యం సీసీఎస్‌కు ఇవ్వవలసిన అసలు, వడ్డీ డబ్బులు చెల్లించాలన్నారు. సీసీఎస్‌లో పాలక మండలి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ రక్షణ- కార్మికుల త్యాగాల దినంగా అక్టోబర్ 7 నుంచి 10 వరకు పాటించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. స్థానిక సమస్యల పైన, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 15న డిమాండ్స్ బ్యాడ్జి ధరించి విధులను నిర్వహించాలని కార్మికులను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అనువైన సమయంలో నిరసనలు చేయాలని తెలిపారు. అక్టోబర్ 19 ‌న ఛలో సీసీసీ ఆఫీస్ కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ వీఎస్ రావు, కో కన్వీనర్ సుద్దాల సురేష్, కత్తుల యాదయ్య, కోశాధికారి డి. గోపాల్, స్వాములయ్య, పీఆర్ రెడ్డి, బీ జక్రయ్య, ఏవీ రావు నాయకులు హాజరైనారు.


Next Story

Most Viewed