- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
టీఎస్ ఎంసెట్ 2023లో అమ్మాయిలదే హవా!

దిశ ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఎంసెట్ ఫలితాలను గురువారం జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. టీఎస్ ఎంసెట్ 2023 లో ఇంజినీరింగ్‌లో 80 శాతం, అగ్రికల్చర్‌లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో మొదటి టాప్ 5 ర్యాంకులలో కుడా ఆంధ్రాకు చెందిన నలుగురు దక్కించుకోవడం విశేషం .
ఇంజనీరింగ్ విభాగం లో టాపర్స్ 1. సనపల్ల అనిరుద్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా , యాకంటి మనిందర్ రెడ్డి 2 వ ర్యాంకు , చల్ల ఉమేష్ వరుణ్ 3 , అభినిత్ మంజెటి 4 , .పన్నతోట ప్రమోద్ కుమార్ రెడ్డి 5 వ ర్యాంకు సాధించారు .ఇందులోనూ టాప్ 5లో నలుగురు ఏపీవాళ్లే కావడం గమనార్హం.
అగ్రికల్చరల్ అండ్ మెడికల్ టాపర్స్ గా నిలిచిన విద్యార్హులు :
అగ్రికల్చర్ పరీక్షలో 84 శాతం అబ్బాయిలు, 87 శాతం అమ్మాయిలు అర్హత సాధించారని తెలిపారు . మొదటి ర్యాంకు .బూరుగుపల్లి సత్య , రెండవ ర్యాంకు .నాసిక వెంకట తేజ, ౩వ ర్యాంకు పసుపులేటి లక్ష్మి, నాల్గవ ర్యాంకు దుర్గంపూడి కార్తికేయ రెడ్డి, ఐదవ ర్యాంకు .బుర్ర వరుణ్ తేజ ను వరించింది . తెలంగాణకు చెందిన విద్యార్థులు 3 ,6 10 ర్యాంకులను సాధించారు. . కాగా తెలంగాణ విద్యార్థులు 4 , 7 ర్యాంకులను సాధించారు . రెండు కేటగిరీల్లో ఏపీకి చెందిన విద్యార్థులే మొదటి ఐదు ర్యాంకులను సాధించడం గమనార్హం.ఇంజినీరింగ్ పరీక్షలో 79 శాతం అబ్బాయిలు, 82 శాతం అమ్మాయిలు అర్హత సాధించినట్టు మంత్రి తెలిపారు . అనిరుధ్ అనే విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ సాధించినట్టు ఆమె ప్రకటించారు .
ఎంసెట్ పరీక్షకు 94.11 శాతం విద్యార్థులు హాజరు !
.మే 10, 11వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షను, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలన్నీ ఆన్ లైన్ లోనే జరిగాయి. ఈ పరీక్షల్లో 94 .11 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు . ఇందులో ఇంజినీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది, అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్థానిక విద్యార్థుల కోసం రాష్ట్ర కోటా కింద 85శాతం రిజర్వ్ చేయగా, 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు.
టి ఎస్ ఎంసెట్ 2023 లో ఇంజనీరింగ్ లో 195275 మంది పరీక్ష రాయగ 1,56,879 మంది ఇంజనీరింగ్ లో ఉత్తిర్ణత సాధించారు (80 3 % ) .అలాగే అగ్రికల్చరల్ మరియు మెడికల్ విభాగంలో 106514 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 91,935 మంది ఉత్తిర్ణత ( 86 .31 %) సాధించినట్టు మంత్రి తెలిపారు . . ఇంజనీరింగ్‌కు 195275 మంది హాజరయ్యారు. అలాగే అగ్రికల్చర్‌కు 106514 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్థానికులకు 85 శాతం సీట్లను కల్పించారు. 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. ఈ పరీక్షలకు మొత్తం మీద 94.44 శాతం హాజరయ్యారు.
స్థానికులకు అవకాశం కల్పించినందున భారీగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు :
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు కలిపి 3,20,310 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెలంగాణకు చెందినవి 2,48,146, ఏపీవి 72,164 ఉన్నాయి. గత సంవత్సరం (2022) మొత్తం 2,66,714 దరఖాస్తులే రావడం గమనార్హం. కాగా ఈ ఏడాది అనూహ్యంగా 53,224 దరఖాస్తులు (20%) పెరిగాయి.
ఎంసెట్ 2023 ఫలితాలను విధుల చేసిన సందర్బంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ ఈ పరీక్షలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పరీక్షలు నిర్వహించిన జె ఎం టి యూ సిబ్బందికి అధికారులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు . పారిష్ల నిర్వహణకు సహకరించిన అన్ని డిపార్ట్మెంట్ సహకరించడం వలన ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు . ఈసారి గతంలో కన్నా ఎక్కువ జాగ్రత్త లు తీసుకున్నమని అతి తక్కువ సమయంలో రిజల్ట్స్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు . మొత్తం 137 సెంటర్ లలో పరీక్షలు నిర్వహించామని 104 తెలంగాణలో 33 ఆంధ్ర లో ఏర్పాటు చేసామన్నారు . తెలంగాణలో 15 జోన్లు, ఏపీలో 6 జోన్లలో పరీక్ష నిర్వహించారని పేర్కొన్నారు . అడ్మిషన్ల ప్రక్రియను జూన్ నెలలో ప్రారంభిస్తామని మంత్రి అన్నారు . పరీక్షలో ఉతిర్ణత సాధించలేని వారు అధైర్యపడొద్దు మరో సరి ప్రయత్నించి మంచి ర్యాంకును సాదించేందుకు కృషి చేయాలనీ విద్యార్థులను కోరారు . యూపిఎస్సి నిర్వహించిన పరీక్షల్లో సివిల్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి మంత్రి అభినందనలు తెలిపారు .
- Tags
- TS MSET