- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
జాతీయ జెండాను అవమాన పరిచిన TRS MLA.. వేదిక వద్దకొచ్చి నిలదీసిన మహిళ (వీడియో)

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, పినపాక మండలాల్లో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం ఆయా మండలాల ఎంపీడీఓలు వీరాస్వామి, శ్రీనివాసులు ఆధ్వర్యంలో అన్ని ప్రవేట్ స్కూల్ విద్యార్థులు, పోలీసులు, అధికారులు కలిసి జాతీయ జెండాలతో ఫ్రీడం ర్యాలీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరై మాట్లాడారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. ఓ మహిళ సభ వద్దకు వచ్చి 'నీ.. ఉగదంపుడు ప్రసంగం ఆపి ట్రాఫిక్‌ను క్లియర్ చేయాలని ఆరోపించింది. రోడ్డుమీద ఎంతోమంది పాఠశాలల చిన్న పిల్లలు, ఆర్టీసీ బస్‌లో ప్రయాణికులు ఊపిరాడక, దాహం వేసి చస్తుంటే నీ ప్రసంగం ఎందుకు. మోరల్ వ్యాల్యూస్ కూడా పాటించకుండా ప్రజలను ఈ రకంగా ఇబ్బంది పెట్టే నిన్ను ఎవరయ్యా ఎమ్మెల్యేగా గెలిపించింది. సీఎం కేసీఆర్ ట్రాఫిక్‌ను ఇబ్బంది పెట్టి, ప్రజలను రోడ్లపై నిల్చోబెట్టి ప్రసంగించాలని చెప్పారా?'' అంటూ నిలదీసింది. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ''నీకు ఎందుకు, అసలు నువ్వు ఎవరు. ఎవరికీ ఏమైనా ఏం కాదులే. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో'' అని ఘాటుగా స్పందించారు.
మరోసారి జాతీయ జెండాను అవమాన పరిచిన MLA
మణుగూరు మండలంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఫ్రీడం ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రేగా అంబేద్కర్ సెంటర్లో జాతీయ జెండాల రంగుల బెలూన్స్ ఎగుర వేస్తున్న క్రమంలో బెలూన్స్ పైకి వేగురలేదు. దీంతో రేగా ఓ కర్రకున్న జాతీయ జెండాను నలిపి ఇష్టం వచ్చినట్లుగా ఆ కర్రతో జాతీయ జెండా రంగుల బెలూన్స్ ఎగురవేశారు. అప్పటికీ ఆ బెలూన్స్ ఎగరకపోవడం గమనార్హం. జాతీయ జెండాను నలిపి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.