- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫీజుల దోపిడీపై టీఆర్ఎస్ పోరుబాట.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి
కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీని అరికట్టేందుకు టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పోరుబాట పట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీని అరికట్టేందుకు టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పోరుబాట పట్టింది. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు లక్డీకాపూల్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌ను ముట్టడించారు. గేట్ ముందు బైఠాయించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ ఒక్కసారిగా వంద శాతం నుంచి 150 శాతం వరకు ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై పెను భారం మోపాయని.. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు.
విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ఫీ రీయింబర్స్ మెంట్ పథకానికి మంగళం పాడేందుకు తీసుకొచ్చిన జీవో 7 ను రద్దు చేయాలని కోరారు. రూ.11 వేల కోట్ల ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి, నారాయణగూడ, సైఫాబాద్, బండ్లగూడ, గోషామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.






