ఈహెచ్​ఎస్ పై ట్రెసా హర్షం

by Dishanational2 |
ఈహెచ్​ఎస్ పై ట్రెసా హర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యోగులందరికీ నగదు రహిత ఆరోగ్య బీమా పథకాన్ని (ఈహెచ్ఎస్) అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించినందుకు సీఎం కేసీఆర్, ఆర్ధిక మంత్రి హరీష్​రావులకు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయిలు, పెన్షనర్లు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న నగదు రహిత వైద్యబీమా పథకాన్ని రెండు శాతం చందాతో ఏర్పాటు చేయాలని ఇతర సంఘాలు అంగీకరించినప్పటికీ, ట్రెసా మాత్రం ఉద్యోగుల అకాంక్షల మేరకు ఒక శాతం చందాతో సదుపాయాన్ని కల్పించాలని కోరినట్లు చెప్పారు.

మా విన్నపాన్ని మన్నించి రాష్ట్రంలో ఉద్యోగులందరికీ ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత వైద్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మరోసారి సీఎం కేసీఆర్ ఉద్యోగుల అకాంక్షల మేరకు పథకాన్ని అమలు చేయడంతో ఉద్యోగుల పట్ల వారికున్న ప్రేమ, అభిమానము చాటారన్నారు. అలాగే ట్రెసా అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షులు కె.నిరంజన్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ నజీమ్ ఖాన్, షఫీయుద్దిన్, సైదులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మంచి అవకాశాన్ని ఇచ్చిన నగదు రహిత పథకాన్ని ఉద్యోగులందరు సక్రమంగా వినియోగించుకోవాలని కోవాలని కోరారు.



Next Story