వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 7వ తేదీ నుండి ఆ రూట్లన్నీ బంద్!

by Disha Web Desk 19 |
వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 7వ తేదీ నుండి ఆ రూట్లన్నీ బంద్!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన ఈ నెల 11వ తేదీన ఫార్ములా- ఈ రేసింగ్ పోటీలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వాహనదారులకు కీలక సూచనలు చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రసాద్ ఐమాక్స్ నుండి సెక్రటేరియట్ వరకు ఈ నెల 7వ తేదీ నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాకుండా 7వ తేదీ నుండి ఎన్టీఆర్ మార్గ్ పూర్తిగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. 11,12వ తేదీల్లో ఖైరతాబాద్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు సీపీ ఆనంద్ తెలిపారు. ఇక, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలకు దాదాపు 21 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఆడియెన్స్ కోసం 16 స్టాండ్‌లు, 4 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 17 పార్కింగ్ ప్లేస్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫార్ములా ఈ రేసింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా 575 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, తెలంగాణ అత్యంత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ ఫార్ములా- ఈ రేసింగ్ పోటీలు 11వ తేదీన జరగనుండగా.. 12వ తేదీన విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. కావున ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా సూచించారు.

Read more:

శంషాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకున్న ఈ-రేసింగ్ కార్లు


Next Story

Most Viewed