‘ఐదేళ్లు రేవంత్ రెడ్డే CM.. ఎవరూ కదిలించరు’

by GSrikanth |
‘ఐదేళ్లు రేవంత్ రెడ్డే CM.. ఎవరూ కదిలించరు’
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గురువారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు ఆయన్ను ఎవరూ కదిలించరు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బీజేపీ నేతలు ఆధారాలు లేని అభియోగాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహేశ్వరెడ్డి ఇప్పటికైనా ఆరోపణలు ఆపితే మంచిదని హితవు పలికారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైట్ పేపర్ లాంటి వాడు.. ఆయనపై ఇంక్ చల్లకండి అని సూచించారు. ఏలేటి మహేశ్వరెడ్డికి బట్టకాల్చి మీదేయడం అలవాటే అన్నారు. అసలు ఉత్తమ్ మీద ఆయనకు ఎందుకంత కోపం వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వర్షాలు పడి ధాన్యం తడిసిందని వెల్లడించారు. తడిసిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రైతులు, రైస్ మిల్లర్లు ఇబ్బంది పడి నష్టపోవొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు బురద జల్లడం సహజమే అని తెలిపారు.

Next Story

Most Viewed