రైతు రుణాలకు మిత్తి కూడా చెల్లించాలి.. టీపీసీసీ స్పోక్స్ పర్సన్స్ భవానీరెడ్డి

by Javid Pasha |
రైతు రుణాలకు మిత్తి కూడా చెల్లించాలి.. టీపీసీసీ స్పోక్స్ పర్సన్స్ భవానీరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కల్పించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆమె గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 లో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందని, కానీ 2023 వరకు అంటే దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఎలాంటి రుణమాఫీ నిధులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టడంతో ఇప్పుడు అవి సగటున లక్షన్నరకు చేరుకున్నాయని తెలిపారు. దీంతో ప్రతి రైతు లెక్క తీసి 2018 వరకు లక్ష రూపాయలు ఉన్న ప్రతి రైతుకు వడ్డీతో సహా రుణం మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ.. 55 నెలల నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. 2018లో కేసీఆర్ రూ. 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని మాట ఇచ్చాడని, హామీ ఇచ్చి 55 నెలలు గడిచినా.. ఇప్పటి వరకు నిరుద్యోగుల ఖాతాలో జమ కాలేదన్నారు. నిరుద్యోగులను కేసీఆర్ కేవలం ఓటర్లుగానే చూస్తున్నారన్నారు.

Next Story

Most Viewed