హాత్ సే హాత్ జోడో కోసం టీపీసీసీ కొత్త కమిటీ

by Disha Web |
హాత్ సే హాత్ జోడో కోసం టీపీసీసీ కొత్త కమిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 26 నుంచి ప్రారంభం కాబోతున్న కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇన్ ఛార్జిలను నియమిస్తూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, మరియు వైస్ ప్రెసిడెంట్లతో ఈ కమిటీని నియమించారు. ఈ కమిటీ తక్షణమే అమలులోకి వస్తుందని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కమిటీ నియామక లేఖను విడుదల చేశారు. వీరంతా తమకు కేటాయించిన పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సంబంధిత ఇన్‌ఛార్జ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సమన్వయం చేసుకుని హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.


Next Story