కేసీఆర్ సర్కార్‌కు ఇంకా 99 రోజులే టైమ్: TPCC ఛీప్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-09-18 13:22:31.0  )
కేసీఆర్ సర్కార్‌కు ఇంకా 99 రోజులే టైమ్: TPCC ఛీప్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ సర్కార్ రోజులు లెక్కబెట్టుకుంటుందని.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంకా 99 రోజులే మిగిలి ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల ప్రకటనతో బీఆర్ఎస్ నేతలు కకావికలమవుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారని.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని.. అలాంటి సోనియా గాంధీ తెలంగాణకు వస్తే స్వాగతించాల్సింది పోయి.. బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు సోనియా గాంధీ రాకతో బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ ముసుగు తొలగిపోయిందని పేర్కొన్నారు.

పదేళ్ల కాంగ్రెస్ పాలనకు, పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రజలు పోల్చి చూడాలని కోరారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని విమర్శించారు. తెలంగాణలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన పథకాలు అమలు అనేది వితండవాదమని రేవంత్ రేవంత్ మండిపడ్డారు. ఆ రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి అక్కడ విధానాలు ఉంటాయని నొక్కి చెప్పారు. తెలంగాణలో దొరల ధోరణికీ ప్రతిరూపమైన ధరణి పోర్టల్‌ను రద్దు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ధరణి పోర్టల్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిపోయిందని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ దోపిడి ఆపితే.. 6 గ్యారెంటీలే కాదు.. ఇంతకుమించిన పథకాలు రాష్ట్రంలో అమలు చేయవచ్చని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed