నేడు రాష్ట్రానికి ప్రధాని మోడీ

by Rajesh |
నేడు రాష్ట్రానికి ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ నేడు తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ రానున్నారు. పలు అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించనున్నారు. రూ.720 కోట్లతో కేంద్రం చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. బీబీ నగర్ ఎయిమ్స్‌లో ఆధునిక భవనాల నిర్మాణాలకూ.. పరేడ్‌గ్రౌండ్ నుంచే శంకుస్థాపన చేయనున్నారు. వాటి నమూనాలను కూడా అక్కడే పరిశీలించనున్నారు. అంతకుముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి హైదరాబాద్ –తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును మోడీ ప్రారంభిస్తారు. 13 ఎంఎంటీఎస్ రైలు సేవలను వర్చువల్‌గా ప్రధాని ప్రారంభిస్తారు. దాదాపుగా 2గంటల పాటు హైదరాబాద్‌లో ప్రధాని పర్యటన సాగనుంది.

పర్యటన ఇలా..

శనివారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. ఉదయం 11.45 నుంచి 12 గంటల 5 నిమిషాల మధ్య సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి ఒంటి గంట 20 నిమిషాల మధ్య పరేడ్ గ్రౌండ్‌లో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. అయితే రాష్ట్రానికి సంబంధించి కీలక హామీల విషయంలో ప్రధాని క్లారిటీ ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది.

Also Read: మోడీ టూర్‌తో పొలిటికల్ హీట్.. బీజేపీని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ స్కెచ్..

Next Story

Most Viewed