రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణ పర్యటన ముహూర్తం ఫిక్స్

by Disha Web Desk 19 |
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణ పర్యటన ముహూర్తం ఫిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈనెల 19వ తేదీన సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థిగా తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈనేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలంగాణకు రానున్నారు. కాగా రాజ్ నాథ్ సింగ్ ఒకరోజు ముందుగానే అంటే 18వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆరోజు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటారు. మరుసటి రోజు కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. ఇదిలా ఉండగా ఈనెల 21న రాష్ట్రానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలంగాణకు వస్తున్నారు.

మెదక్, సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాదవ సంఘాలతో నిర్వహించనున్న సమావేశానికి మోహన్ యాదవ్ హాజరుకానున్నారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను బీజేపీ వైపునకు ఆకర్షితులను చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈనెల 15వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్‌తో ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో దీక్షను చేపట్టనున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed