టైమ్స్ నౌ- ETG సర్వే : కేంద్రంలో అధికారం ఆ పార్టీదే..!

by Disha Web Desk 4 |
టైమ్స్ నౌ- ETG సర్వే : కేంద్రంలో అధికారం ఆ పార్టీదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 లోక్ సభ ఎన్నికలపై టైమ్స్ నౌ - ఈటీజీ సర్వే చేసింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. కేంద్రంలో ఈ సారి కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి మూడో సారి అధికారం చేజిక్కించుకుంటుందని ఈ సర్వే తెలిపింది.

లోక్ సభలో మొత్తం 543 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (ఎంపీ) స్థానాలు ఉండగా బీజేపీ 308-328 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. ఎన్డీఏ కూటమికి 44 శాతం, ఇండియా కూటమికి 39 శాతం, వైఎస్‌ఆర్ సీపీకి 3శాతం, బీజేడీకి 2శాతం, బీఆర్ఎస్ కు ఒక శాతం, ఇతరులకు 11శాతం ఓటు షేర్ దక్కుతుందని సర్వే వెల్లడించింది.

బీజేపీ : 308-328

కాంగ్రెస్ : 52-72

వైఎస్ఆర్ సీపీ : 24-25

డీఎంకే : 20-24

టీఎంసీ : 20-24

బీజేడీ : 13-15

బీఆర్ఎస్ : 3-5

ఆప్ : 4-7

ఇతరులు : 66-76 స్థానాలు గెలుచుకుంటాయని సర్వే వెల్లడించింది. మోడీ చరిష్మాను మూడో సారి కూడా కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి ఆపలేదని ఈ సర్వే పేర్కొంది. ఇక, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed