డేట్ ఫిక్స్.. ఈ నెల 13న బాధ్యతలు స్వీకరించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Satheesh |
డేట్ ఫిక్స్..  ఈ నెల 13న బాధ్యతలు స్వీకరించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ చీఫ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి మోడీ 3.0 కేబినెట్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మోడీ 2.0 మంత్రి మండలిలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా పని చేసిన కిషన్ రెడ్డికి.. మోడీ 3.0 కేబినెట్‌లో కేంద్ర బొగ్గు, గనుల మంత్రిగా ఛాన్స్ దక్కింది. కేంద్ర మంత్రిగా ప్రధాని మోడీతో పాటే ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి.. మంత్రిగా ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి బొగ్గు, గనుల మంత్రిగా చార్జ్ తీసుకునేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13న ఉదయం 11 గంటలకు కిషన్ రెడ్డి బొగ్గు, గనుల మంత్రిత్వశాఖ బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా, మోడీ 3.0 కేబినెట్‌లో తెలంగాణ నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కింది. కిషన్ రెడ్డికి కేబినెట్ హోదాతో మంత్రి దక్కగా.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు హోం శాఖ సహయ మంత్రి పోస్ట్ లభించింది.

Next Story

Most Viewed