సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం.. ముహూర్తం ఖరారు

by GSrikanth |
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం.. ముహూర్తం ఖరారు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశానికి టైమ్ ఫిక్స్ అయింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనున్నది. తాము అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలపై సంతకం పెట్టి అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ‘అభయహస్తం’ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలో ఇవాళ జరగబోయే కేబినెట్ సమావేశంలో ఆరు గ్యారంటీల అమలు, రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన పరిపాలన పరమైన కీలక అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Next Story

Most Viewed