- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Revanth Reddy : ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదీ..! : నిర్వచనం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో(Triumph of public governance) శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పాల్గొన్నారు. నేడు తెలంగాణ పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్(Freindly Policing) అంటే.. పోలీసులు బాధితులతో ఫ్రెండ్లీగా ఉండాలని.. నేరస్తులు, కబ్జాదారులతో ఫ్రెండ్లీగా ఉండటం కాదన్నారు. సమాజంలో అత్యధికంగా కష్టపడేది పోలీసులు అని, అత్యంత విమర్శలు ఎదుర్కునేది పోలీసులే అన్నారు. కొంతమంది పోలీసుల వలన అలాంటి చెడ్డ పేరు వస్తుందని.. పోలీసు శాఖపై ఉన్న చెడ్డ పేరును తొలగించుకోవాలని తెలిపారు. పోలీసులు ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదని, ప్రోటోకాల్స్ ఎంతవరకు పాటించాలో అంతే పాటించాలని సూచించారు. ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వచ్చి హడావిడి చేయాలి అనుకుంటే ముందు వారిని లోపల వేయండని.. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని వెల్లడించారు. ఏదైనా సమస్యలు వస్తే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాడని, ఎలాంటి సమస్యలైనా.. పరిష్కారాలు, సలహాలు, సూచనలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
- Tags
- CM Revanth Reddy