ఇది వారి గొప్ప విజయం.. సుప్రీం కోర్టు ఉత్తర్వులపై కేటీఆర్ స్పందన

by Mahesh |
ఇది వారి గొప్ప విజయం.. సుప్రీం కోర్టు ఉత్తర్వులపై కేటీఆర్ స్పందన
X

దిశ, వెబ్ డెస్క్: కంచ గచ్చిబౌలి(సెంట్రల్ యూనివర్సిటీ) భూముల్లో 100 ఎకరాల్లో చెట్లను నరికి వేయడం (Cutting down trees) పై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి ప్రభుత్వంపై ఫైర్ అయింది. ఈ రోజు విచారణలో భాగంగా చెట్లను నరికేందుకు అనుమతులు (Permissions) తీసుకున్నారా.. అన్ని కోర్టు ప్రశ్నించగా వాల్టా చట్టం ప్రకారం స్వీయ అనుమతులతో చెట్లను తొలగించామని కోర్టుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. దీంతో ఆగ్రహించిన కోర్టు చెట్లనరికివేతను సమర్ధించుకునే ప్రయత్నం చేయవద్దని మండి పడింది. అలాగే 100 ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించే ప్రణాళిక (Tree restoration plan)తో ముందుకు రావాలని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ.. విచారణను మే15కు వాయిదా వేసింది.

కాగా ఈ ఆదేశాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కంచ గచ్చిబౌలిలో అడవిని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం గొప్ప విజయమని చెబుతూ.. ఎక్స్(Twitter)లో పోస్టు పెట్టారు. అందులో ఇలా రాసుకొచ్చారు. కంచ గచ్చిబౌలిలో అడవిని పునరుద్ధరించాలని,ఈ ప్రాంతంలోని అన్ని వన్యప్రాణుల భద్రతను నిర్ధారించాలని తెలంగాణ ప్రభుత్వానికి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌కు కోర్టు ఆదేశించడం పర్యావరణ రక్షణను కోసం పోరాటం చేసిన వారందరికీ లభించిన గొప్ప విజయం." అని రాసుకొచ్చాడు. అలాగే కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందని, కోర్టు ఉత్తర్వులతో నైన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నామమని కేటీఆర్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు

Next Story

Most Viewed