ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కారులో చోరీ

by Disha Web Desk 4 |
ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కారులో చోరీ
X

దిశ, జూబ్లీహిల్స్ : ప్రముఖ సినీనిర్మాత బెల్లంకొండ సురేష్ కారు అద్దాలు పగలగొట్టి నగదు తో పాటు ఖరీదైన మద్యం సీసాలు చోరీకి గురి అయిన వైనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ప్రకారం జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌కి చెందిన సాయి గణేష్ ప్రొడక్షన్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం బెల్లంకొండ సురేష్ తన బెంజ్ కారును కార్యాలయం ముందు నిలిపారు. శుక్రవారం ఉదయం కారును చూడగా కారు ఎడమవైపు వెనుక సీటు వద్ద అద్దం పగిలి ఉంది.

కారు లోపల ఉంచిన 50 వేల నగదు, ఖరీదైన మద్యం సీసాలు కనిపించకపోవడంతో చోరికి గురయ్యాయని అప్రమత్తం అయిన సురేష్ భార్య పద్మావతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు చోరీకి గురి అయిన కార్యాలయంలో పనిచేసే వ్యక్తులు చేశారా.? లేక బయట వ్యక్తులు చేశారా..? సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నమని ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

Also Read: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్ సినిమాలు ఇవే



Next Story