జన్వాడలో దారుణం.. పెట్రోల్ బంక్‌లో కార్మికుడ్ని కొట్టి చంపిన యువకులు

by GSrikanth |
జన్వాడలో దారుణం.. పెట్రోల్ బంక్‌లో కార్మికుడ్ని కొట్టి చంపిన యువకులు
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: పోయించుకున్న పెట్రోల్‌కు డబ్బు అడిగిన పాపానికి ముగ్గురు యువకులు బంక్ ఉద్యోగిని కొట్టి చంపారు. ఈ దారుణం సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత రంగారెడ్డి జిల్లా జన్వాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జన్వాడలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు సోమవారం రాత్రి 12 గంటలు దాటిన తరువాత ముగ్గురు యువకులు కారులో వచ్చారు. అప్పటికే బంక్ క్లోజ్ చేయగా.. చాలా దూరం వెళ్లాల్సి ఉందని యువకులు బతిమిలాడటంతో పెట్రోల్ పోశారు. అనంతరం యువకులు డబ్బు చెల్లింపులకు కార్డ్ ఇచ్చారు.

అయితే, అది పని చెయ్యలేదు. నగదు ఇవ్వాలని అడిగాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన యువకులు మమ్మల్నే క్యాష్ అడుగుతావా అంటూ ముగ్గురు యువకులు అతనిపై దాడి చేశారు. బంక్‌లో పని చేస్తున్న సంజయ్ అనే మరో యువకుడు గొడవను గమనించి అడ్డుకోబోగా.. అతనిపైనా పిడిగుద్దుల వర్షం కురిపించారు. దాంతో సంజయ్ అక్కడే కుప్పకూలి చనిపోయాడు. అది చూసి ముగ్గురు యువకులు కారులో పరారయ్యారు. కాగా, ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఫుటేజ్ ఆధారంగా ఈ దారుణనికి ఒడిగట్టింది జన్వాడ‌కే చెందిన నరేందర్, మల్లేష్, అనూప్‌లని గుర్తించారు. ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed