- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
కాపాడాల్సిన వాళ్లే కాటేస్తున్నారు..!

దిశ, దుండిగల్: కాపాడాల్సిన వాడే కాటేసినట్లుంది రెవెన్యూ అధికారుల తీరు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు కాసుల కుకక్కుర్తిపడుతూ కబ్జాదారులు సహకరిస్తుండడంతో ప్రభుత్వ భూములు, ప్రజా ప్రయోజన స్థలాలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నా యి. దుండిగల్ మండల పరిధిలోని బౌరంపేట ఇందిరమ్మ కాలనీ సర్వే నెం. 576, 577లో 2007లో అప్పటి ప్రభుత్వం పేదల ఇంటి ని ర్మాణానికి 650 పట్టాలిచ్చింది. కానీ వెయ్యికి పైగా నిర్మాణాలు వెలిశాయి. సమీపంలోని ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాల్లో కూడా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కెన్నెత్తి చూడడంలేదు. స్థానిక అధికారి సహకారంతోనే నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు ఉన్నాయి.
పార్కు స్థలాలు మాయం
మిగులు భూములు, ప్రజాప్రయోజన స్థలాలను అమ్మి సొమ్ము చే సుకుంటున్న కబ్జాదారుల కన్ను పార్కు స్థలాలపై కన్నుపడింది. సర్వే నెం. 577లోని పార్కు స్థలంలో 200 గజాలు కబ్జా చేసి బేస్మిట్ నిర్మాణం చేపడుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అధికారుల కాసుల కక్కుర్తితో విలువైన స్థలాలు కనుమరుగవుతున్నాయంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కఠిన చర్యలు తప్పవు
ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న అక్రమనిర్మాణాలపై తహశీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతిన్‌ను వివరణ కోరగా అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటివారినైనా ఉపేక్షించేదన్నారు. సర్వే నెం. 576, 577లో జరుగుతున్న నిర్మాణాలను తొలగించాలని ఆదేశించామన్నారు. కబ్జాదారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు.