మోడల్ స్కూల్ టీచర్స్‌ బదిలీల షెడ్యూలు ప్రకటించాలి

by Disha Web |
మోడల్ స్కూల్ టీచర్స్‌ బదిలీల షెడ్యూలు ప్రకటించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మోడల్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్‌కి బదిలీల షెడ్యూలు ప్రకటించాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, ప్రధాన కార్యదర్శి కె.నగేష్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, మంత్రి హరీశ్ రావును కలిసి వినతిపత్రం అందించారు. మోడల్ స్కూల్ టీచర్స్ పదేళ్లుగా పనిచేస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటూ మానసిక క్షోభకు గురువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ టీచర్స్ బదిలీల షెడ్యూల్‌తో పాటు మోడల్ స్కూల్ టీచర్స్ బదిలీల కూడా షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. ప్రభుత్వ టీచర్స్ బదిలీల తర్వాత అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆ తర్వాత పది, ఇంటర్ పరీక్షలు మూల్యకనం ఉండటంతో ప్రస్తుతం బదిలీల షెడ్యూల్ రాకుంటే తర్వాత జరిగే అవకాశం లేదని టీచర్స్ ఆందోళనలో ఉన్నట్లు వివరించారు. కొత్త స్కూల్స్‌లో కొత్త ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉందని, ఒకటే దగ్గర సంవత్సరాల తరబడి పనిచేయడం భారంగా ఉందని, మోడల్ స్కూల్ టీచర్స్ బాధను అర్థం చేసుకుని వెంటనే షెడ్యూల్ ప్రకటించాలని కోరారు.


Next Story