చలితో వణుకుతున్న ఏజెన్సీ ప్రాంతాలు.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

by Disha Web |
చలితో వణుకుతున్న ఏజెన్సీ ప్రాంతాలు.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ఏజేన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో గ్రామాలను పొగమంచు కప్పేసింది. ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ కు పడిపోయింది. దీంతో సిర్పూర్ లో 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే.. బజార్ హత్నూర్ 7.2, బేలలో 7.5, కెరమెరిలో 7.7, తిర్యాణి లో 7.9, ఆదిలాబాద్‌లొ 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారీగా మంచు పట్టడంతో ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం మానేశారు.Next Story