హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఉద్యోగులను కొనసాగించాలని ఆదేశాలు

by Dishafeatures2 |
TS High Court Asks Government to file Report on Right to Education
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను యథావిధిగా కొనసాగించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు పట్ల గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ లు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 18న రాష్టంలోని జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లను భర్తీ చేసుకునేందుకు గాను మార్గదర్శకాలు జారీచేశారు. అయితే వీరిలో కేవలం పీజీ మెరిట్ ద్వారా కొత్త వారిని ఎంపిక చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో గత 10 ఏండ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను కాదని ఈ నిర్ణయం వల్ల 1654 మంది రోడ్డున పడే ప్రమాదం ఉన్న క్రమంలో పెద్ద ఎత్తున గెస్ట్ లెక్చరర్లంతా కలిసి విద్యాశాఖ మంత్రి ఇంటివద్ద, ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టడమే గాక ప్రజాప్రతినిధులు, అధికారి ప్రతిపక్ష నాయకులు, విద్యార్థి, ఉద్యోగ సంఘాల నుండి పెద్ద ఎత్తున మద్దతు గెస్ట్ లెక్టరర్లు పోరాడారు.

ఈ క్రమంలోనే నిర్ణయం ఆలస్యం అవుతున్న క్రమంలో వారు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ పి.మాధవి దేవి గత కొన్నేండ్లుగా పనిచేయించుకుని ఇప్పుడెందుకు మళ్ళీ కొత్తవారిని ఎంపిక చేస్తున్నారని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ను ప్రశ్నించగా..వీరి నియామకాలు సరైన పద్దతిలో జరగలేదని చెప్పగా..అలా ఐతే గతంలో ఎందుకు వీరినే కొనసాగించారని? ఒక తాత్కాలిక ఉద్యోగిని తొలిగించి మరొక తాత్కాలిగ ఉద్యోగిని నియమించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్దం మరియు సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు అవుతుందని వెంటనే.. 1654 మంది గెస్ట్ లెక్చరర్లని యథావిధిగా కొనసాగించాలని ఇంటర్ కమిషనర్ ను, ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఈ సందర్బంగా గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ లు మాట్లాడుతూ.. ప్రభుత్వం కొనసాగించాలని ఉత్తర్వులిచ్చినా, గెస్ట్ లెక్చరర్ల పట్ల మొండి వైఖరి తో కొత్త నోటిఫికేషన్ వేసిన ఇంటర్ కమిషనర్, అధికారులకు ఇది చెంపపెట్టని పేర్కొన్నారు. హై కోర్ట్ తీర్పు పట్ల అసోసియేట్ ప్రెసిడెంట్ కోడి మహేష్ కుమార్, ఉపాధ్యక్షుడు ఎం.బాబురావు, కోశాధికారి బండి కృష్ణ , రాష్ట్ర కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed