- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రెండో శనివారం సెలవును రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం

X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన వచ్చిన రెండో శనివారం సెలవును రద్దు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వర్తించదని... కేవలం హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణంగా రెండో శనివారం రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. కానీ, గణేష్ నిమర్జనం పురస్కరించుకుని సెప్టెంబర్ 9న సాధారణ సెలవును ప్రకటించిన నేపథ్యంలో.. దానికి బదులుగా ఈ నెల 12వ తేదీన రెండో శనివారాన్ని పనిదినంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Read more:
Next Story