విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడుల తేదీలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

by Disha Web Desk 12 |
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడుల తేదీలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: మార్చి నెల ప్రారంభానికి ముందే రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. అలాగే పదో తరగతి పరీక్షలు జరిగే కొన్ని పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్న కూడా క్లాసులు జరిపేందుకు పర్మిషన్లు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed