పీఆర్సి కమిషన్ వెంటనే నియమించండి.. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్

by Dishafeatures2 |
పీఆర్సి కమిషన్ వెంటనే నియమించండి.. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్
X

దిశ , తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి పీఆర్సీ ప్రకటించిన నేపథ్యంలో రెండవ పీఆర్సి కమిషన్ వెంటనే నియమించాలని, 20% మద్యంతర భృతి ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమార స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కూలంకుశమైన చర్చ చేయడం జరిగిదని అయన తెలిపారు. ఈ సందర్బంగా పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారని అయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ను రద్దుచేసి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తేవాలని తెలిపారు. బకాయి ఉన్న మూడు డీఏలను వెంటనే ప్రకటించాలని 317 జీవో వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించి ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్స్ వెంటనే మంజూరు చేయాలని తెలిపారు . ఉద్యోగ ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టాలని అన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే తెలంగాణ రాష్ట్రానికి రప్పించాలని కోరారు. హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి న్యాయవివాదాలను పరిష్కరించడానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పారు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కరించడానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఒక మంత్రుల కమిటీ వేసి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని తీర్మానం చేయడం జరిగిందని అయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర సెక్రెటరీ జనరల్ డా.జి.నిర్మల , గడ్డం బాలస్వామి, యాకుబ్ పాషా, ఎం.కె.రాజు, భరత్, సత్యనారాయణమల్లేష్, వీరయ్య, నర్సింగ్ రావు, సురేష్ గౌడ్, చారి, బాలరాజు, విద్యాసాగర్ అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Next Story