ఈసీ నియామకంలో పాటిస్తున్న మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 13 |
ఈసీ నియామకంలో పాటిస్తున్న మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల కమిషనర్ల నియామకం లో పాటిస్తున్న మార్గదర్శకాలు చెప్పాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీబీఐ డైరక్టర్‌ తరహాలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ ల కమిటీ ద్వారా ఎంపిక జరపాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పై సుప్రీంకోర్టు లో బుధవారం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని కోర్టు ముందు ఉంచాలని జస్టిస్‌ కెఎం జోసెఫ్‌ ధర్మాసనం అదేశించింది. సుప్రీంకోర్టు లో ఎన్నికల కమీషనర్ల నియామకం పై విచారణ ప్రారంభమైన మూడు రోజుల్లోనే అరుణ్ గోయల్ నియామకం జరిగిందని, విచారణ జరుగుతున్నప్పుడు ఎన్నికల కమిషనర్‌గా నియామకం జరగకుండా ఉంటే మరింత సముచితంగా ఉండేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అరుణ్‌ గోయల్‌ నియామకానికి సంబంధించిన ఫైళ్లను రేపే (గురువారం) తీసుకురావాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించించింది. ఈ కేసును విచారించడం మొదలుపెట్టిన తర్వాత నియామకం జరిగినందున ఈ నిమాయకానికి సంబంధించిన దస్త్రాలను చూడలనుకుంటున్నామని, అపాయింట్‌మెంట్ కోసం అనుసరించిన ప్రక్రియ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ నియామకం చట్టబద్ధమైనదైతే భయపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోయల్ ను కేంద్ర ఎన్నికల కమిషనర్ గా గత శనివారం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది. దీంతో తక్షణమే ఆయన నియామకం అమల్లోకి వస్తోందని న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.


Next Story

Most Viewed