‘దిశ’ కథనం కదిలించింది.. తీరిన నస్కల్ శాఖర వాగు వద్ద రోడ్డు సమస్య

by Disha Web Desk 11 |
‘దిశ’ కథనం కదిలించింది.. తీరిన నస్కల్ శాఖర వాగు వద్ద రోడ్డు సమస్య
X

దిశ, పరిగి: పరిగి నుంచి నస్కల్​ మీదుగా వికారాబాద్​ జిల్లా కేంద్రానికి వెళ్లే మార్గంలో శాఖర వాగు వంతెన వద్ద రోడ్డు ప్రమాదకరంగా మారిందని ‘దిశ’ పత్రిక వరుస కథనాలు రాయడంతో ఎట్టకేలకు ఆర్​ అండ్​ బీ అధికారులు ఆదివారం స్పందించారు. ‘పక్కకు పడితే పరలోకమే’, ‘కలెక్టర్​ మేడం కాస్త పట్టించుకోండి ’ , ‘రోడ్డు ఎలాగో వేయరు.. కనీసం మట్టైనా పోయండి ’ , ‘ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా’ ‘నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం’ ఇలా వరుస కథనాలు రాయడంతో స్థానిక పాలకులు, ఆర్​ అండ్​ బీ అధికారులు స్పందించారు.

ప్రమాదకరంగా మారిన గుంతల్లో ఆదివారం బీటీతో ప్యాచ్​ వర్క్​ చేశారు. కోతకు గురై సైబ్​ బర్మ్​ కొట్టుకుపోగా జేసీబీ సాయంతో మట్టి పోశారు. సమస్యను పట్టించుకోవడం లేదంటూ దిశ పత్రిక వరుస కథనాలు రాసి అటు ఆర్​ అంబ్​ బీ అధికారులు ఇటు పాలకుల్లో చలనం తీసుకువచ్చి సమస్య తీర్చినందుకు ప్రయాణికులు, నస్కల్​ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే వర్క్​ ఐదు రోజుల క్రితం చేసి ఉంటే బాల్​ రాజ్​ ప్రాణం మిగిలేదేమోనంటూ కొందరు అనుకోగా.. బాల్​ రాజ్​ చనిపోతే గాని అధికారులు, పాలకులలో చలనం రాలేదంటూ వాపోయారు.








Next Story

Most Viewed