నారాయణ , శ్రీ చైతన్య విద్యాసంస్థలను సీజ్ చేయాలి.. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ

by Dishafeatures2 |
నారాయణ , శ్రీ చైతన్య విద్యాసంస్థలను సీజ్ చేయాలి.. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిత్యం ఆత్మహత్యలకు కారణం అవుతున్న నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం బాచుపల్లి నారాయణ కళాశాలలో విద్యార్థిని వంశీక ఆత్మహత్యకు కళాశాల వారే బాధ్యులని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాల వద్ద విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి ఆందోళన నిర్వహించారు. కళాశాల లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ బాచుపల్లి నారాయణ కళాశాలలో విద్యార్థిని వంశీక ఆత్మహత్యకు ముమ్మాటికీ కళాశాల వారే బాధ్యులని, కళాశాల సీసీ ఫుటేజ్ లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం అయి పది రోజులు గడవక ముందే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటే వారి వేధింపులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలని ఆరోపించారు.

నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలకు ఇంటర్ బోర్డు అధికారులు వత్తాసు పలుకుతున్నారని కళాశాల లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుగా ఉన్నారంటేనే వారి తప్పు తెలుస్తుందని చెప్పారు. నిత్యం నారాయణ, శ్రీ చైతన్య కళాశాలల్లో ఆత్మహత్యలు జరుగుతున్న ఎందుకు వాటిని సీజ్ చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలని, నారాయణ, శ్రీ చైతన్య కళాశాలల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై ప్రభుత్వం విచారణ జరిపించి వాటిని సీజ్ చేయాలని నారాయణ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిన బాబు, శివ కుమార్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story