కాళేశ్వరం కన్నా.. బాహుబలి సెట్టింగ్ ఇంకా బలంగా ఉంది: బీజేపీ ఎమ్మెల్యే

by Disha Web Desk 12 |
కాళేశ్వరం కన్నా.. బాహుబలి సెట్టింగ్ ఇంకా బలంగా ఉంది: బీజేపీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి కాళేశ్వరం ప్రాజేక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడో సారి మోడీ సర్కార్ నినాదంతో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేస్తుంది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం సభలో కాటిపల్లి మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని.. వారి అవినీతికి అంతులేకుండా పోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజేక్ట్ కంటే.. సినిమా కోసి తాత్కలికంగా వేసిన బాహుబలి సెట్.. నేటికి బలంగా ఉందని విమర్శించారు. అలాగే ఖమ్మంలో ఒక్కసారి కూడా బీజేపీ గెలవలేదని.. కనీసం ఎంపీటీసీ కూడా గెలవకున్నా.. కేంద్రంలోని బీజేపీ..8 వేల కోట్లతో నేషనల్ హైవే నిర్మించిందని ఎమ్మెల్యే కాటిపల్లి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Next Story

Most Viewed