ఢిల్లీలో ఆప్ ఓటమికి అవినీతే కారణం : మెదక్ ఎంపీ

by Kalyani |
ఢిల్లీలో ఆప్ ఓటమికి అవినీతే కారణం : మెదక్ ఎంపీ
X

దిశ, మెదక్ ప్రతినిధి : ఢిల్లీలో కేజ్రీవాల్ చెల్లె కవిత తో కలిసి సీసాలు అమ్మి శీష్ మహాల్ నిర్మించాడని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. మెదక్ లో బీజేపీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా మండల పార్టీ అధ్యక్షుల తో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. అన్నా హజారే శిష్యుడిగా అవినీతిపై పోరాటం చేస్తానని వచ్చిన కేజ్రీవాల్ పాలన అంతా అవినీతి బురదలో మునిగిందన్నారు. చెల్లె కవిత తో కలిసి సీసాలు అమ్మితే వచ్చిన డబ్బుతో కేజ్రీవాల్ శీష్ మహాల్ పేరుతో అద్దాల మెడ నిర్మించాడని ఆరోపించారు. మహాల్ లో నిర్మించిన టాయిలెట్స్ కు రూ. 50 కోట్లు ఖర్చు చేయడం పై ఢిల్లీ ప్రజల్లో ఆగ్రహం తెచ్చేందుకు ప్రధాన కారణంగా చెప్పారు. అవినీతి మరక ఉన్నా ఏ పార్టీకి ప్రజలు దగ్గరకు తీయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో పాటు కేసీఆర్ ప్రభుత్వం కార్ల కొనుగులు లో కూడా అవినీతికి పాల్పడిందని విమర్శించారు.

బీ అర్ ఎస్ పార్టీ చేసిన అవినీతి, కుటుంబ పాలన నుంచి ప్రజలు దూరం పెట్టారని అన్నారు. నేటి సమాజంలో కష్టపడి నిజాయితీగా అంటేనే ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారని, లేదంటే అధఃపాతాళానికి తొక్కుతారని ఢిల్లీ లో వచ్చిన ఫలితాలే నిదర్శనం గా అభివర్ణించారు. పప్పు యాదవ్ గురించి మాట్లాడడానికి ఏమి లేదన్నారు. ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి కూడా కాంగ్రెస్ కు గాడిద గుడ్డు సున్నానే వచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఢిల్లీ లో ఉన్న ఏడు సీట్లకు ఏడు బీజేపీ యే గెలిచిందని, గత కొన్ని పర్యాయాలుగా అక్కడి ప్రజలకు కాంగ్రెస్ కు గుండు సున్నా కే పరిమితం చేస్తున్నారన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం వస్తే ముక్త్ భారత్ సాధిస్తామని చెప్పారు. రెండు సీట్లే అన్నప్పుడు అందులో తెలంగాణ నుంచి ఒక్క సీటు, గుజరాత్ నుంచి ఒక ఎంపీ సీటు ఉందని, కానీ తెలంగాణ లో మాత్రం ఇప్పటికీ ప్రభుత్వం రాలేదని అన్నారు.

అందరూ కష్టపడితే భవిష్యత్ లో తెలంగాణ లో పక్క బీజేపీ సర్కార్ వస్తుందని ధీమా గా చెప్పారు. 125 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీగా చెప్పే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేసిందని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో మోడీ 370 ఆర్టికల్ రద్దు చేశాడని, రామ మందిరం నిర్మాణం చేశాడని, రోజుల ఆరు కోట్ల మంది వస్తున్న మహా కుంభ మేళా ను విజయవంతంగా అక్కడి ప్రభుత్వం కొనసాగిస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటా విఫలమైందని ఆరోపించారు. 8 వేల మంది ఉద్యోగులు రిటైర్డు అయితే ఒక్కరికీ బెనిఫిట్స్ ఇవ్వకపోగా ప్రభుత్వం ఇస్తామని చెప్పిన డిఎన్ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, విష్ణు వర్ధన్ రెడ్డి, పంజా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed