గౌతమ బుద్ధుని సందేశం అదే..సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Mamatha |
గౌతమ బుద్ధుని సందేశం అదే..సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్:ధ్యానాన్ని పనిగా చేయడం కాదని ప్రతి పనిని ధ్యానంగా పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గౌతమ బుద్ధుని సందేశం అదేనన్నారు. బుద్ధుడు ఈ పేరు వినగానే ప్రశాంతంగా కళ్లు మూసుకుని, ధ్యాన సముద్రంలో ఉన్న బోధిసత్వుడు నిర్మల రూపం మనకు గుర్తుకు వస్తుంది. బుద్ద పూర్ణిమ పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..నేను పని చేసేటప్పుడు ధ్యానంగా ఉంటా అని చెప్పారు. సమాజంలో అశాంతి, అసూయలను అధిగమించవలసిన బాధ్యత అందరిదీ అన్నారు. మంచి సందేశం ఉన్న ఆలోచనను పెంపొందించుకోవాలి. సమాజానికి మేలు చేయాలన్న తలంపును ఇతరులకు పంచాలి. గౌతమ బుద్ధుడి సందేశం అందరికీ అవసరం అని తెలిపారు. మహాబోధి బుద్ధ విహార్‌కు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది అని తెలిపారు. ప్రతిపాదనలు పంపితే ఎన్నికల కోడ్ ముగిశాక నిధులు మంజూరు చేస్తాం అని తెలిపారు.

Next Story