లంచం తీసుకుంటూ పట్టుబడి వెక్కి వెక్కి ఏడ్చిన లేడీ ఆఫీసర్.. వీడియో వైరల్

by Disha Web Desk 13 |
లంచం తీసుకుంటూ పట్టుబడి వెక్కి వెక్కి ఏడ్చిన లేడీ ఆఫీసర్.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో:లంచం తీసుకోవడం నేరం అని తెలిసినా కొంత మంది అవినీతి అదికారులు తమ తీరు మార్చుకోవడం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఓ మహిళా ఆఫీసర్ వెక్కి వెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో జగజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ఓ వ్యవహారంలో తన సంతకం కోసం జగజ్యోతి బాధితుడి నుంచి రూ. 84 వేల లంచం డిమాండ్ చేసింది. దీంతో చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీ ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం బాధితుడి నుండి జగజ్యోతి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అకస్మాత్ పరిణామంతో షాక్ తిన్న జగజ్యోతి ఆపై ఏసీపీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.


Next Story

Most Viewed