నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది! దీక్ష విరమించిన అశోక్

by Disha Web Desk 14 |
నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది! దీక్ష విరమించిన అశోక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష చెప్పట్టిన సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఆయన నిరాహార దీక్షలో ఉన్నారు. ఇవాళ అశోక్ సార్ దీక్షను విరమించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉస్మానియా హాస్పిటల్‌కి వెళ్లి నిమ్మరసం ఇచ్చి దీక్ష‌ను విరమింపచేశారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, నిరుద్యోగుల ప్రతి సమస్యను ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హమీ ఇచ్చారు.

సీఎంతో నిరుద్యోగుల సమస్యలపై, వారి డిమాండ్స్ పై చర్చలకి తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఇప్పటికే జీవో 46 పై కమిటీ వేయడం జరిగిందని, గ్రూపు2, 3 పోస్ట్ ల పెంపు పై వెబ్ నోట్ ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు టెట్ పరీక్షలకు కూడా జీవో ఇచ్చిందని తెలిపారు. గురుకుల బ్యాక్ లాగ్ పోస్ట్ లపై, ఇతర నిరుద్యోగుల సమస్యలపై కూడా ప్రభుత్వం పరిష్కరించడానికి కృషి చేస్తుందని తెలిపారు. కాగా, నిరుద్యోగులు మాత్రం ఈ హామీలను నమ్మడం లేదు. అశోక్ సార్ దీక్షను విరమింపజేయడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని నిరుద్యోగులు అంటున్నారు.

Next Story