- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనార్టీ యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
మైనార్టీ యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ అన్నారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో : మైనార్టీ యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మైనార్టీ సంక్షేమ శాఖ, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) సంయుక్త ఆధ్వర్యంలో నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో మెగా జాబ్ మేళా మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి అజారుద్దీన్ నగర ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ.. మెగా జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌తో పాటు అన్ని విభాగాల అధికారులకు, భాగస్వామ్య సంస్థలను అభినందించారు. గత పదేళ్లలో అమలుకాని అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్లలోనే వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల అభ్యున్నతి, సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు తదితర అన్ని మైనారిటీ వర్గాల యువతకు సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. జాబ్ మేళా ఉద్దేశ్యం కేవలం ఆఫర్ లెటర్లు అందించడం మాత్రమే కాదని, ప్రతి అభ్యర్థి ఉద్యోగంలో చేరే వరకు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. భవిష్యత్తులో నిజామాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇలాంటి మెగా జాబ్ మేళాలను నిర్వహించి మరింత మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మైనారిటీ గురుకులాల వైస్ చైర్మన్ ఫహీముద్దీన్ ఖురేషీ, మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి బి. షఫీఉల్లా, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
పేరొందిన కంపెనీలలో ఉద్యోగాలు ..
ఈ జాబ్ మేళాలో 50 నుంచి 60 వరకు ప్రముఖ కంపెనీలు,హెచ్‌ఆర్ ప్రతినిధులు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించారు. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, రిటైల్ అండ్ హాస్పిటాలిటీ, ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్, మాన్యుఫాక్చరింగ్ అండ్ అసెంబ్లీ, ఆటోమొబైల్ అండ్ మొబిలిటీ, నిర్మాణ, మౌలిక వసతులు, ఐటీఈఎస్ / బీపీఓ, కార్పొరేట్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్ అండ్ హెల్త్‌కేర్, మేనేజ్‌మెంట్, కామర్స్ వంటి సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2 వేలమంది మైనారిటీ యువత ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఉద్యోగ అవకాశాలతో పాటు కెరీర్ కౌన్సెలింగ్ సేవలు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల నమోదు ప్రక్రియ కూడా నిర్వహించారు .






