ఫలించిన ఆమ్రపాలి చర్చలు.. ఆందోళన విరమించిన కాంట్రాక్టర్లు

by Gantepaka Srikanth |
ఫలించిన ఆమ్రపాలి చర్చలు.. ఆందోళన విరమించిన కాంట్రాక్టర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: పెండింగ్‌ బకాయిలు చెల్లించాలంటూ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట రెండ్రోజులుగా బల్దియా కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. వివిధ అభివృద్ధి పనులకు రావాల్సిన రూ.1500 కోట్ల మేర బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తాజాగా శనివారం వారితో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి చర్చలు జరిపారు. చర్చల అనంతరం తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నట్లు కాంట్రాక్టర్లు ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న రూ.1500 కోట్ల బిల్లులను దశలవారీగా చెల్లిస్తామని ఆమ్రపాలి వారికి హామీ ఇచ్చారు. కాగా, ఈనెల 5వ తేదీలోగా బకాయిలను చెల్లించకుంటే జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించడంతో ఆమ్రపాలి రంగంలోకి దిగి కాంట్రాక్టర్లతో చర్చలు జరిపారు.



Next Story

Most Viewed