- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు.. రూ.580 కోట్లతో కాలువల నిర్మాణం
దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీనం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిషాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే దక్షిణ కొరియాలోని నదుల సుందరీకరణ, మురుగునీటి శుద్ధి కార్యక్రమాలను పరిశీలించడానికి మంత్రులు, అధికారుల బృందం వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమాలను ఒక్కొక్కటిగా చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో ముఖ్యమైన ప్రాజెక్టులను జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాలు చేపడుతున్నాయి.
రూ.580 కోట్లతో..
జీహెచ్ఎంసీ పరిధిలో 1302 కిలో మీటర్ల వరద నీటి ప్రవాహ వ్యవస్థ ఉంది. వీటిలో మేజర్, మైనర్ నాలాలు ఉన్నాయి. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం మురుగునీటి నాలాలు, వరదనీటి కాలువలు కలిసిపోతున్నాయి. మురుగునీటితో వర్షపు నీరు కలిసి మూసీలో కలుస్తుంది. అయితే మూసీ ప్రాజెక్టులో భాగంగా ఈ రెండింటిని వేర్వేరు చేయనున్నారు. మురుగునీటిని సీవరేజీ ట్రీట్ ప్లాంట్(ఎస్టీపీ)లోకి పంపించి శుద్ధి చేసిన తర్వాతనే మూసీలో పంపించే విధంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీంతో పాటు నాలా వ్యవస్థతో పాటు వరద నీటి కాలువ వ్యవస్థను సైతం పటిష్టం చేయాలని, వరద నీరంతా మూసీలోకి నేరుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ రూ.580 కోట్లతో 43 ప్రాంతాల్లో 58 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాలని నిర్ణయించింది. వీటిలో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరికొన్ని పనులకు జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించింది.