- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం.. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు హెచ్చరిక
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, కార్పొరేట్ విద్యా మాఫియాకు ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తీవ్రంగా విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, కార్పొరేట్ విద్యా మాఫియాకు ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తీవ్రంగా విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దొడ్డిదారిన జీవో నెంబర్ 7 తీసుకువచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలను ఎత్తివేయడానికి కుట్ర చేస్తోందని మండిపడ్డారు. పాత బకాయిలు విడుదల చేయకుండా నాటకాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని చూడటం దుర్మార్గమన్నారు.
కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేలా తక్షణమే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. ప్రభుత్వ బడులు, కాలేజీల్లో కనీస వసతులు, టాయిలెట్లు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు సకాలంలో అందించాలన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో పెంచిన ఫీజులను తగ్గించి, తగినంత బడ్జెట్ (బ్లాక్ గ్రాంట్) కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం పూర్తిగా విఫలమయ్యారని, విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని రాంబాబు హెచ్చరించారు.






