రేవంత్‌తో పాటు ప్రమాణం చేయబోయే మంత్రులెవరు?

by GSrikanth |
రేవంత్‌తో పాటు ప్రమాణం చేయబోయే మంత్రులెవరు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు ఆసక్తిని పెంచుతున్నాయి. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో డీకే శివకుమార్‌తో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు సమావేశం కావడం ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై స్పష్టత రావడంతో మంత్రిమండలి కూర్పుపై అధిష్టానం దృష్టి సారించింది. పార్టీలో ఎవరికీ అసంతృప్తి లేకుండా కేబినెట్ కూర్పు ఉండేలా హైకమాండ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రేపు రేవంత్‌తో పాటు ఒక డిప్యూటీ సీఎం మరో ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

ఫస్ట్ ఫేజ్‌లో ఎవరెవరికి ఛాన్స్ దక్కబోతున్నదనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో డీకే శివకుమార్‌తో ఉత్తమ్, భట్టి, శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ తదితరులు కలిశారు. వీరంతా మంత్రి వర్గ కూర్పుపై డీకేతో చర్చించారనే ప్రచారం జరుగుతోంది. అయితే తొలివిడత మంత్రివర్గ కూర్పు అనంతరం స్పీకర్ ఎవరు అనేది తేల్చబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీకి నమ్మకమైన వ్యక్తి, సభను సజావుగా నడిపించగల సామర్థ్యం కలిగిన వ్యక్తి కోసం అధిష్టానం అన్నికోణాల్లో బేరీజు వేసుకుంటున్నట్లు టాక్. స్పీకర్ ఎవరో తేలిన తర్వాత పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచరం. ఈ మేరకు ఇవాళ డీకేతో టీకాంగ్రెస్ సీనియర్ల సమావేశం ఉత్కంఠగా మారింది.


గవర్నర్‌తో కాంగ్రెస్ బృందం భేటీ!

టీ- కాంగ్రెస్‌లో మరో ట్విస్ట్! డీకేతో ఇద్దరు ముఖ్యనేతల భేటీ



Next Story