ఘనంగా ముగిసిన సీఎం కప్ 2023 షూటింగ్ పోటీలు..

by Disha Web Desk 13 |
ఘనంగా ముగిసిన సీఎం కప్ 2023 షూటింగ్ పోటీలు..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి సీఎం కప్ 2023 పేరుతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ క్రీడా ప్రాధికారిత సంస్థ వారు మొత్తం 18 క్రీడలలో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రయ విశ్వవిద్యాలయంలోని తెలంగాణ క్రీడా ప్రాధికారిత సంస్థ షూటింగ్ రేంజి లో నిర్వహించిన ఫైనల్ పోటీలు ఘనంగా ముగిశాయి. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు.

అనంతరం ఆమే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక శ్రద్ధతో ఈ సీఎం కప్ ని ప్రారంభించడం జరిగిందని, ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమానికి ముందుకెళ్ళేలా కృషి చేసిన రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ క్రీడా ప్రాధికారిత సిబ్బందికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ బహుమతుల కార్యక్రమంలో షూటింగ్ రేంజ్ అడ్మినిస్ట్రేటర్ అలెగ్జాండర్ పాల్గొన్నారు.. ఫైనల్ పోటీలు విజయవంతం అయ్యేలా కృషి చేసిన ఆయనను మేయర్ అభినందించారు.


Next Story