ముగిసిన తెలంగాణ కేబినేట్ భేటీ

by Dishafeatures2 |
ముగిసిన తెలంగాణ కేబినేట్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గురువారం కొత్త సెక్రటేరియట్ లో ప్రారంభమైన కేబినేట్ సమావేశం ముగిసింది. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు కావొస్తున్నా సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల 2 నుంచి 21 వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనుండగా.. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లపై కేబినేట్ లో చర్చించారు. ఇక దళిత బంధు, గృహలక్ష్మీతో పాటు ఇతర పథకాలకు సంబంధించి కూడా భేటీలో చర్చించినట్లు సమాచారం.

అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపై కూడా కూడా సీఎం మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాలు, ఇళ్లపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ భేటీలో మంత్రులు పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read..

కేసీఆర్ ప్రభుత్వంపై రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు



Next Story

Most Viewed