కేసీఆర్ ఆధ్వరంలో BRS కీలక మీటింగ్.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే డుమ్మా..!

by Disha Web Desk 19 |
కేసీఆర్ ఆధ్వరంలో BRS కీలక మీటింగ్.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే డుమ్మా..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. లాంగ్ గ్యాప్ తర్వాత గురువారం తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్.. భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ కీలక భేటీకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తలసాని కొడుకు తలసాని సాయికిరణ్ యాదవ్ గైర్హాజరు అయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తలసాని పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టుగా ఉంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రతి సమీక్షలో ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో తలసాని వ్యవహారం పార్లమెంట్ ఎన్నికల గులాబీ పార్టీలో వేళ హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పార్టీ మారుతారని పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే, నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే సీఎం రేవంత్‌తో భేటీ అయ్యానని.. బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తి లేదని పార్టీ మార్పు వార్తలను ప్రకాష్ గౌడ్ ఖండించారు.

అప్పటి నుండి కాస్త సెలైంట్‌గా ఉన్న ప్రకాష్ గౌడ్ ఇవాళ పార్టీ చీఫ్ కేసీఆర్ సమక్షంలో జరుగుతోన్న కీలక భేటీకి హాజరుకాకపోవడంతో మరోసారి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ సమావేశానికి హాజరు కాకపోవడంపై తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్ స్పందించారు. ఇవాళ సమావేశం ఉన్నట్లు తనకు తెలియదని.. అందుకే మీటింగ్‌కు హాజరు కాలేదని క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా గులాబీ బాస్ అధ్యక్షతన జరుగుతోన్న బీఆర్ఎస్ కీలక సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హాజరు కాకపోవడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరీ వీరు భేటీకి హాజరుకాకపోవడానికి అసలు కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది.

Read More..

KCR: నాకు కొద్దిగా సమయం ఇవ్వండి.. ఎలక్షన్ కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్ రిక్వెస్ట్

Next Story

Most Viewed