- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TGPSC Group-4: గ్రూప్-4 అభ్యర్థులకు గుడ్ న్యూస్..త్వరలోనే ఫైనల్ ఫలితాలు విడుదల..!
దిశ, వెబ్‌డెస్క్:గ్రూప్-4 అభ్యర్థులకు(Group-4 candidates) తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) శుభవార్త చెప్పింది. గ్రూప్-4 పరీక్ష ఫైనల్ ఫలితాలను(Final results) త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) ప్రకటించారు. సోమవారం కొంతమంది అభ్యర్థులు మంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించారు. 45 రోజుల క్రితమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన ఇంకా తుది ఫలితాలను ప్రకటిస్తలేరని ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తుమ్మల వెంటనే టీజీపీఎస్సీ(TGPSC) ఛైర్మన్ మహేందర్ రెడ్డి(Mahender Reddy)కి ఫోన్ చేశారు. గ్రూప్-4 ఫైనల్ ఫలితాలు తొందరగా ప్రకటించాలని కోరారు. కాగా 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి 2023లో నోటిఫికేషన్ విడుదల కాగా అదే సంవత్సరం జులైలో పరీక్షలు నిర్వహించారు. ఇక అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరి 9న విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 7,26,837 మంది అభ్యర్థులతో మెరిట్ జాబితాను టీఎస్‌పీస్సీ విడుదల చేసింది. అలాగే ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ధ్రువపత్రాల పరీశీలన కూడా పూర్తయింది.