Group -1 Hall Tikets: టీజీపీఎస్సీ గ్రూప్ -1 హాల్ టికెట్లు విడుదల

by Prasad Jukanti |
Group -1 Hall Tikets: టీజీపీఎస్సీ గ్రూప్ -1 హాల్ టికెట్లు విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీజీ పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలో అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు టీజీఎస్ పీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. తెలంగాణ రాష్ట్రంలో 563 పోస్టు భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల నిర్వహాణ కోసం కమిషన్ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.ఇప్పటికే కొన్ని గైడ్ లైన్స్ ను సైతం విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని కమిషన్ పేర్కొంది.

Advertisement

Next Story