- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
TGPSC: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్..మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల ఎప్పుడంటే..?
దిశ, వెబ్‌డెస్క్:తెలంగాణ(TG) రాష్ట్రంలో 563 గ్రూప్-1(Group-1) పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల(Mains Exams) నిర్వహణకు టీజీపీఎస్సీ(TGPSC) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి.మెయిన్స్ రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు(Hall Tickets) మరో వారం,పది రోజుల్లో విడుదల కానున్నాయి.ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్(tgpsc.gov.in) నుండి అడ్మిట్ కార్డు(Admit Cards)లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.కాగా తొలిరోజు తీసుకెళ్లిన హాల్ టిక్కెట్‌నే మిగిలిన ఆరు పరీక్షలకు తీసుకెళ్లాలని,రోజుకో కొత్త హాల్ టిక్కెట్‌తో వెళితే ఇన్విజిలేటర్లు అనుమతించరని పేర్కొంది. అభ్యర్థి తప్పనిసరిగా ప్రతి పరీక్ష రోజు హాల్ టిక్కెట్‌పై సంతకం చేయాలని TGPSC తెలిపింది. గ్రూప్-1 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి అయ్యేవరకు హాల్ టికెట్లను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించింది.కాగా గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాలకు జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, జులై 7న ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.