- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TG High Court Jobs: తెలంగాణ హైకోర్టులో 'లా క్లర్క్' ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..!
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ హైకోర్టు(Telangana High Court) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 33 'లా క్లర్క్(Law Clerk)' పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 23 నవంబర్ 2024. ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు, తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ, సికింద్రాబాద్‌లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కొరకు అభ్యర్థులు https://tshc.gov.in/ వెబ్‌సైట్ ను సందర్శించగలరు.
పోస్టు పేరు, ఖాళీలు:
- లా క్లర్క్(Law Clerk) - 33
విద్యార్హత:
అభ్యర్ధులు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ‘లా’ కోర్సులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, వర్క్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు జులై 1, 2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
దరఖాస్తులను ‘ది రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి. దరఖాస్తులను సమర్పించడానికి నవంబర్ 23, 2024వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది.
ముఖ్య గమనిక:
లా క్లర్క్ పోస్టులకు ఎంపికైన వారు జాబ్ చేసే సమయంలో ఏదైనా కోర్సును చదవడం గానీ, మరేదైనా శాలరీ వచ్చే ఉద్యోగం గానీ చేయకూడదు.