గుప్త నిధుల కోసం గుడిలో తవ్వకాలు.. సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన గ్రామస్తులు!

by Disha Web Desk 2 |
గుప్త నిధుల కోసం గుడిలో తవ్వకాలు.. సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన గ్రామస్తులు!
X

దిశ, చిన్నకోడూరు: కాకతీయుల కాలంలో నిర్మించిన గుడిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన చిన్నకోడూరు మండల పరిధిలోని సలంద్రి గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామంలో కాకతీయుల కాలంలో ఆక్కన్న.. మాదన్నలు నిర్మించిన శివాలయంలో ఆదివారం అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ పూజలో రెండు కోళ్లు, నిమ్మకాయలు, గోమూత్రం, కొబ్బరికాయలు, దేవాలయం చుట్టూ దీపాలు వెలిగించారు. పసుపు కుంకుమలతో శివాలయం చుట్టూ పూజలు నిర్వహించారు. శివాలయంలోని శివలింగాన్ని తవ్వి పక్కన పెట్టి, తవ్వకాలు ప్రారంభించారు. రైతులు అడవి పందుల కాపలా కోసం వ్యవసాయ పొలాల వద్దకు రావడంతో సుమారుగా 8 మంది దుండగులు పరారయినట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి చిన్నకోడూరు ఎస్ఐ సుభాష్ గౌడ్ చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Next Story