Breaking News : తెలంగాణ మహిళా కమిషన్ ఆకస్మిక తనిఖీలు

by M.Rajitha |
Breaking News : తెలంగాణ మహిళా కమిషన్ ఆకస్మిక తనిఖీలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మహిళా కమిషన్(Telangana Women Commission) వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఇటీవల పలు సెంటర్లపై వరుసగా అనేక ఫిర్యాదులు రావడంతో ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. బాలసదనంతోపాటు, నగరంలోని పలు సఖి సెంటర్లను కమిషన్ పరిశీలించింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ళ శారద(Nerella Sharada) పిల్లల సమస్యలపై ప్రత్యేకంగా వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. సమస్యలు తెలుసుకొని వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాను మరోసారి తనిఖీలకు వస్తానని.. అప్పుడు ఒక్క సమస్య కూడా తనకు కనిపించకూడదని కమిషన్ చైర్‌పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed