- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తెలంగాణ టూరిజం ఆఫీస్ అగ్నిప్రమాదం ఓ కుట్ర.. : సీపీఐ నారాయణ
దిశ, డైనమిక్ బ్యూరో: హిమాయత్‌నగర్‌లోని తెలంగాణ టూరిజం ప్రధాన కార్యాలయంలో ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వరకే అగ్నిప్రమాదం జరిగిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన తెలంగాణ టూరిజం ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అడ్మినిస్ట్రేట్ ఆఫీస్‌లో ఆ శాఖకు సంబంధించిన లావాదేవీలాంటి మొత్తం ఫైల్స్ అక్కడే ఉంటాయని తెలిపారు. టూరిజం తరపున దాదాపు 40 నుంచి 50 వరకు హోటల్స్ లీజుకు ఇచ్చారని, పెద్ద వ్యాపారం జరుగుతున్నదని తెలిపారు.
అనేక రకాలుగా ఇందులో అవకతవకలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయని, దీనికి ఎండీగా ఉన్న అతన్ని ఇటీవల ఎన్నికల కమిషన్ ఎండీని తీసివేసిందని వెల్లడించారు. అయితే దీని ఎండీకి, కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి అభినాభావ సంబంధం ఉందని ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోబోతున్నదని, కొత్త ప్రభుత్వం వస్తున్నదని, దీంతో ఈ టూరిజంలో జరిగిన అనేక అవకతవకలు బయట పడే అవకాశం ఉందని, అందుకే ఉద్దేశ్య పూర్వకంగానే అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీస్‌ను తగలబెట్టారని ఆరోపించారు.
ఇది ముమ్మాటికి అగ్నిప్రమాదం కాదని తేల్చి చెప్పారు. అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడడానికి చేసే కుట్రలో భాగమే అగ్నిప్రమాదం క్రియేట్ చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే హై లెవల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ సారి రాదనే.. పక్కా ప్లాన్‌తోని బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు.
- Tags
- cpi narayana